14, జనవరి 2013, సోమవారం

venu gaanam:      సంక్రాంతి  శుభాకాంక్షలు తెలుగు భాషకు సమున్నత ...

venu gaanam:      సంక్రాంతి  శుభాకాంక్షలు తెలుగు భాషకు సమున్నత ...:       సంక్రాంతి  శుభాకాంక్షలు   తెలుగు భాషకు సమున్నత పట్టం కడుతున్న భాషాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

23, డిసెంబర్ 2012, ఆదివారం

                    సమస్యలు వదిలి సన్నాహాలా ?

      తెలుగు భాషను  అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ ప్రపంచ తెలుగు మహా సభలకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం శోచనీయం. తమిళనాడు కర్ణాటక  రాష్ట్రాల్లో వారి  భాషలకు  ఇచ్చే గౌరవం అభినందనీయం. వారి భాషాభిమానం లో మన రాష్ట్రానికి పదో వంతు కూడా లేక పోవడం భాధాకరం. 
      ప్రాథమిక స్థాయిలో తెలుగు భాష నేర్పించడానికి ఒక్క తెలుగు పండితుణ్ణి కూడా నియమించ లేదు. ఉన్నత పాటశాలల్లో కూడా మిగతా అన్ని విషయాలు భోదించేందుకు స్కూల్ అసిస్టెంట్  పోస్టులను సృష్టించిన మన ఘనత వహించిన  ప్రభుత్వం  భాషా పండితుల పోస్టులను  మాత్రం ఉన్నతీకరించకుండా వెట్టి చాకిరి చేయిస్తోంది. గత కొన్నేళ్ళుగా పండిత పరిషత్ ఎన్నో రకాల ఆందోళనలు చేపట్టినా   ఫలితం   మాత్రం శూన్యం.   భాషాభిమానులు ఈ విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.